“మినీకథా చక్రవర్తి” కె.బి.కృష్ణ :కాకినాడ
వీరి 35 సంవత్సరాల సాహితీ వ్యాసంగం లో 675 పైగా కథలూ, 16 నవలలూ రచించారు. వెలువడిన వీరి పుస్తకాలు: 1 గాయత్రి, 2. ఆమె చెప్పింది (51 మినీ కధలు) 3. అనుబంధాలు 4. అభిషేకం { 101 మినీ కథలు ) 5. సంస్కారం (36 మినీకథలు) 6.చిత్రలోకం, 7. రివర్స్ గేర్ విశాలాంధ్ర పబ్లికేషన్స్ హాస్యకథలు 8.జంతర్ మంతర్ 9. మోహనరాగం, నవలలు. కో-జోక్స్ బుక్ ఆమె చెప్వింది - 51 మినీ కథల సంపుటి మరియు చిత్రలోకం పుస్తకం, కన్నడ భాషలో శ్రీ కె.యల్.రంగనాథరావు గారిచే అనువదింపబడి బెంగుళూరు లో 2013, 2016 లో విడుదలయ్యాయి.
“ఈ కొట్టుకు సెలవు లేదు "పెద్దకథకు ఆస్ట్రేలియా తెలుగు వారి " తెలుగు పలుకు " పత్రిక ప్రథమ బహుమతి.. “మోహనరాగం” రొమాంటిక్ థిల్లర్ కి స్వాతి 16 వారాల సీరియల్ పోటీలో రు. 25,000/- బహుమతులు పొందారు. ఇంకా అనేక బహుమతుల పొందారు. 2003 లో అంజలి గోదావరి పుష్కర ప్రతిభా పురస్కారం, 2008 లో కె.ఆర్. మోహన్ స్మారక పురస్కారం, 2009 లో వేదగిరి కమ్యూనికేషన్స్ వారిచే వందేళ్ళ తెలుగుకథ పండుగల్లో రజత పతక బహూకరణ, 2011 లో కథకు నల్గొండ డా. నోములపత్యనారాయణ పురస్కారం, 2013 లో మచిలీపట్నం ఆంధ్రసారస్వత సమితి ఉగాది పురస్కారం మొదలగునవి. 2012 లో "కౌముది "వెబ్ మేగజైన్ లో "పునరపి జననం-" సీరియల్ వెలువడింది. 6-11-2016 తేదీన, కర్నూలు తెలుగు హాస్య కళా సమితి(రి) రేడియన్స్ సాహిత్య సాంస్రృతిక సంస్థ,వారు నిర్వహించిన సాహిత్య సభలో వీరికి "మినీ కథా చక్రవర్తి " అనే బిరుదు ప్రదానం చేయబడింది. 3-12-2016 తేదీన వీరికి ఆంధ్ర సారస్వత సమితి (రి) మచిలీపట్నం వారి స్వర్ణోత్సవాలలో "సాహిత్యజీవన సాఫల్య ప్రతిభా పురస్కారం "రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ గారి చే ప్రదానం చేయబడింది.
వీరి రచనలపై వివిధ వ్వివిద్యాలయాలలో పరిశోధన చేసి ఇద్దరు యమ్.ఫిల్ పట్టాలు పొందారు. ప్రస్తుతం ఒకరు పి.హెచ్.డి కొరకు, ఇంకొకరు హాస్యకథల పై యమ్.ఫిల్ కొరకు పరిశోధన చేస్తున్నారు.
కేంద్రసాహిత్య అకాడమీ “ Who is who of Indian Writers” గ్రంథం లో వీరి పేరు చేర్చబడింది. “Indian Society of Authors, new Delhi” సంస్థలో వీరు జీవితసభ్యునిగా కొనసాగుతున్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో వైస్ ప్రెసిడెంట్ గానూ, అలయన్స్ క్లబ్ లో సభ్యునిగానూ 2010 వరకూ సామాజిక సేవ చేశారు.
సందేశాత్మకమైన, అమలిన శృంగారం తో కూడిన కథలూ, హాస్యకధలూ, కరుణరసాత్మక మైన కథలూ, ఇలా నవరసాలలో కథలు రచిస్తున్న వీరికి ఇంకా ఎన్నో సంవత్సరాలు కథలు రాయాలనుంది.
- - - - - -