పేరు: భావరాజు పద్మినీ ప్రియదర్శిని
నివసించే ప్రాంతం : చండీగర్
email : acchamgatelugu@gmail.com
స్వపరిచయం :
నమస్కారం ! నా పేరు భావరాజు పద్మినీ ప్రియదర్శిని . 1978 , సెప్టెంబర్లో మా అమ్మమ్మగారి ఊరైన నరసాపురంలో జన్మించాను. అమ్మ
పద్మ, నాన్న ప్రసాద్ గార్లు చిన్నప్పటి నుంచి అందించిన సాహిత్యాభిరుచితో
ఫిబ్రవరి 21, 2012 లో పేస్ బుక్ లో 'అచ్చంగా తెలుగు'
అనే బృందాన్ని స్థాపించి, రచనలు
మొదలుపెట్టాను. ఆ ప్రస్థానం ,
దైవానుగ్రహంతో, మా గురువుగారైన
శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ ఆశీర్వాద బలంతో, ఇలా 'అచ్చంగా తెలుగు' అంతర్జాల మాస
పత్రిక స్థాపించి, మూడున్నర సం. నుంచి నడిపే దాకా సాగింది. ఇలా అందరి అభిమానం
చూరగొన్న నా వ్యంగ్య రచనలను ఎమెస్కో వారు 'వ్యంగ్యాస్త్రం' పేరిట
ప్రచురించారు. ఇవి కాక అనేక కవితలు, కధలు, వ్యాసాలు, పద్యాలు, సీరియల్స్, గజల్స్ రచించాను. శ్రీవారు సతీష్
ప్రోత్సాహంతో మున్ముందుకు అడుగులు వేస్తున్నాను. ఇద్దరమ్మాయిలు అనుష, అదితి, దైవమిచ్చిన వరాలు.
నాకు సంగీతమన్నా సాహిత్యమన్నా ప్రాణం. మనసును తాకే ప్రతి అక్షరం నాకు దైవసమానం.
ఎక్కువగా సరదా రచనలు, హృద్యమైన కవితలు ఇష్టపడతాను. ముళ్ళపూడి వెంకటరమణ గారు, శ్రీరమణ గారు, మృణాళిని గారు, పురాణం సుభ్రమణ్య
శాస్త్రి గారు, వంశీ గారు నా అభిమాన రచయతలు. నా రచనలను క్రింది లింక్ లలో చదవచ్చు.
వెబ్ పత్రికలో ఇంతవరకూ ప్రచురించబడ్డ నా రచనలు చదివేందుకు క్రింది లింక్ ను ఉపయోగించగలరు...
http://www.acchamgatelugu.com/search?q=%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81+%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF+
"అచ్చంగా తెలుగు" సాహిత్యం గురించిన అంశాలు, మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు క్రింది బ్లాగ్ లో ...
http://acchamgatelugu.blogspot.in/
నా కవితలన్నీ ఇక్కడ పదిలపరచి ఉన్నాయి.
http://naakavitalokam.blogspot.in/
నా హాస్య/ వ్యంగ్య వ్యాసాల సంకలనం క్రింది బ్లాగ్
http://naavyaasaalu.blogspot.in/
సరదాగా కాసేపు నవ్వుకోవాలంటే క్రింది బ్లాగ్ ను సందర్శించండి. నవ్వేజనాసుఖినోభవంతు !
http://navvejanaasukhinobhavantu.blogspot.in/
నేను రాస్తున్న "మా బాపట్ల కధలు" ముందు భాగాలన్నీ క్రింది లింక్ లలో అందుబాటులో ఉన్నాయి.
http://www.acchamgatelugu.com/2016/03/ma-bhavannarayanudu.html
http://www.acchamgatelugu.com/2016/04/manikyamma-gari-manavaralu-1.html