రచయిత పేరు: శ్రీ. దొండపాటి కృష్ణ
నివసించేది: హైదరాబాద్
పనిచేస్తున్నది: LandLord Infra Group (a corporate Real Estate company)
చదివినది: MCA (Master of Computer Applications @JNTUK)
గురువుగారి పేరు: శ్రీ. చెరుకువాడ సత్యనారాయణ (సి.యస్) @కాకినాడ
ఉత్తమ కథ: రాతి గుండెలో నీళ్ళు (జనవరి-2020, తెలుగు వెలుగు ప్రచురణ)
చరవాణి: 0 90 52 32 68 64
స్వీయ పరిచయం:
అందరికీ నమస్కారం!
నేను దొండపాటి కృష్ణను. తెలుగు కథా రచయితగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాను. ఇప్పటివరకు 20కి పైగా కథలు వివిధ వార, మాస పత్రికల్లో అచ్చయ్యాయి. 6 కథలు బహుమతులను గెలుచుకున్నాయి. మరికొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి. రాతి గుండెలో నీళ్ళు కథ ఈనాడు కథా విజయం – 2019లో విజయం సాధించి నన్ను నలుగురికి చేరువ చేసింది. ఉత్తమ ప్రశంసలు అందుకుంది. నాన్న గోవర్ధనరావు, అమ్మ రంగమ్మ, శ్రీమతి స్వప్నలే ప్రపంచం. ఊరు కొత్త రేమల్లె గ్రామం.
డిగ్రీ చదివే రోజులనుంచీ కవిత్వాన్ని రాస్తున్నా, అందులో తప్పొప్పులు ఎలా ఉన్నాయో తీర్చిదిద్దింది గురువుగారు సి.యస్.గారు. కాకినాడలో పోస్ట్ గ్రాడ్యేషన్ చదివిన మూడు సంవత్సరాలే కాక ఇప్పటికీ నా రచనలపై ఆయన ప్రభావం ఉంటుంది. తప్పొప్పులను సరి చేస్తూనే ఉంటారు.
కథలు రాయడం మాత్రం 2010లో ప్రారంభించినా వ్యక్తిగత కారణాల దృష్టా వాటిపై అంతగా ఆసక్తి కనబరచలేదు. ప్రముఖ కవయిత్రి శ్రీమతి. సుజాత తిమ్మన గారి ద్వారా అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రిక గురించి తెలియడం, నేను వాళ్ళను సంప్రదించడం, ఆ పత్రిక సంపాదకురాలు శ్రీమతి. భావరాజు పద్మిని గారు సానుకూలంగా స్పందించి, ప్రతినెలా ఓ కథ వేసి నన్ను ప్రోత్సహించడంతో మళ్ళీ కథా రచన పట్ల ఆసక్తి పెరిగింది. అచ్చంగా తెలుగులో నా కథలన్నీ ఇక్కడ కిందనున్న లింక్ లను క్లిక్ చేసి చదవొచ్చు.
వివిధ పత్రికల్లో నా రచనలు రావడానికి ముఖ్య కారకులు ప్రముఖ కథకులు శ్రీ. ఆర్.సి.కృష్ణస్వామిరాజు గారు. పత్రికలకు, కథల పోటీలకు కథలు పంపడం ఎలాగో ఎంతో ఓపికగా తెలియజేసి నా ఎదుగుదలకు తోడ్పడ్డారు. ప్రస్తుతం ప్రముఖ వరిష్ట రచయిత్రి శ్రీమతి. నండూరి సుందరీ నాగమణి గారి పర్యవేక్షణలో నా రచనలు మరింత వన్నె తెచ్చుకుంటున్నాయి. ఇందుమూలంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
*
పత్రికలో వీరి రచనలను క్రింది లింక్ లో చదవండి...