పేరు: రెడ్లం చంద్రమౌళి
నివసించే ప్రాంతం : పలమనేరు
email : mouli.sairam@gmail.com
స్వపరిచయం :
ఓం శ్రీ సాయిరాం...ఆత్మీయ తెలుగువారికి నా నమస్సులు. నా రచనా ప్రస్తానం 23-11-2015 న అచ్చులు దిద్దుకుంది. ఆ సాయిరాముడి కృపా కటాక్షం వల్ల, నా తలిదండ్రుల ఆశ్వీరాద బలంతో నేటికీ నిర్విరామంగా కొనసాగుతోంది. నా మొదటి వ్యాసం "ధ్యానం" శ్రీవాణి అను సాంస్కృతిక మాస పత్రిక యందు జనవరి 2016 సంచికలో ప్రచురితం కావడంతో నా రచనా ప్రస్తానం రూపుదాల్చుకుంది. అటు పిమ్మట " నా పదములో ఒదిగినా భావమా " అంటూ అచ్చంగా తెలుగువారికి పరిచయం అయ్యింది. అక్కడి నుండీ "నిరతము నాలో నిన్నే కొలువైపోని" అంటూ సాగే గీతంతో నా ఆత్మారాముడైన సాయిరాముని ఆవిష్కరించినా నేనే, "ఈ తొలిప్రేమ యదలోన చిగురించని" అను గీతంతో ప్రేమను ఒలికించినా నేనే , సంగీతం స్వరమేలే సాహిత్యం పదమేలే అంటూ సాగే గీతం " కళ్యాణి మణిద్వీపమందున ఉదయించే తొలిరాగమై" అన్నా నేనే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ను "అనుకోనికవితనై నిన్నల్లినాను" అంటూ సాగే కవితలో తొలిసారి ప్రేయసిని చూసిన ప్రియుని మనసులో భావాలను కవితగా ఆవిష్కరించినా నేనే.... పద్యాలు,గేయాలు, పాటలు, కవితలతో అచ్చంగా తెలుగువారి ఆదరాభిమానాలను చూరగొని ఈరోజిలా మీ ముందు నిలబడింది కూడా నేనే మీ చంద్రమౌళి. redlambrothers.blogspot.com ఇది నా బ్లాగు, నా రచనల కొరకు ఈ బ్లాగును సందర్శించగలరు. మన్ముందు మరిన్ని సరికొత్త రచనలతో తెలుగు సాహితీ సముద్రంలో ఈ చిన్న నీటి బిందువు ఉడతా భక్తితో అందిస్తున్న అక్షర చినుకులు మీ అందరి ఆదరాభిమానాలను చూరగొంటాయని భావిస్తూ ముందుకు సాగుతోంది. ధన్యవాదములు.
పత్రికలో వీరి రచనలను క్రింది లింక్స్ లో చదవి, మీ విలువైన అభిప్రాయాలు తెలుపండి.