పేరు: మణి వడ్లమాని
నివసించే ప్రాంతం : హైదరాబాద్
email : vadlamani.manimurthy@gmail.com
స్వపరిచయం : పాఠకుల కు నమస్కారం . నా పేరు మణివడ్లమాని.హైదరాబాదులో నివాసం. సాహిత్యమంటే ఇష్టం. 2010 లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కధలు రాయాలనే అభిలాష తో రాసిన తొలి కధ “కృష్ణం వందే జగద్గురుం” కౌముది లో ప్రచురిచతమైంది. ఇఇప్పటి దాకా దాదాపు ఒక నలభయి కధలు రాసాను , తొలి కధ కౌముది అంతర్జాల మాసపత్రికలోప్రచురించారు. ఆ తరువాత వరుసగా నవ్య,ఆంధ్రభూమి స్వాతి,తెలుగు వెలుగు,విపుల,రచన,జాగృతి వంటి వార,మాస పత్రికలలో ను,ఆంధ్రప్రభ,సాక్షి,నమస్తే తెలంగాణా,మనతెలంగాణ వంటి దినపత్రికలలో,విశాలాంధ్ర వారి దీపావళి సంచికలో,సారంగా ,అచ్చంగా తెలుగు,కినిగే,ాఆంధ్రప్రభ అంతర్జాల పత్రికలలో నా కధలు ప్రచురింప బడ్డాయి. చతుర మాస పత్రికలో నా తొలి నవల "జీవితం ఓ ప్రవాహం" ప్రచురణఅయింది
బహుమతుల వివరాలు:
1. గో తెలుగు.కాం వారి హాస్యకధల పోటిలో ప్రధమ బహుమతి వచ్చింది
2 ఫేస్బుక్ లోని కధా గ్రూప్ నిర్వహించిన కధల పోటిలో ప్రధమబహుమతి వచ్చింది.
3. అమెరికా తెలంగాణా సంఘం(ATA) వారి సావనీర్ కు పెట్టిన కధల పోటిలో నా కధ కి మొదటి బహుమతి వచ్చింది.
4 వంగూరిఫౌండేషన్ వారి మధురవాణి.కాం వారు నిర్వహించిన పోటిలో నా కధ మేనిక్విన్ కి ఉత్తమ బహుమతి వచ్చింది.