పేరు: ఆదూరి హైమావతి (హైమా శ్రీనివాస్)
నివసించే ప్రాంతం : బెంగుళూరు, Now Chicago. USA
email : habalavikas@gmail.com
స్వపరిచయం :
నేను 1964 నుండీ ఉపాధ్యాయినిగా పనిచేస్తూ 2004లో విశ్రాంతి పొందాను.1994 లో భారత రాష్ట్రపతి ద్వారా నేషనల్ అవార్డ్ , 2003లో కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్రసరస్వతి స్వామీజీ ద్వారా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ లభించింది.సత్యసాయి బాలవికాస్ లో స్టేట్ ఫేకల్టీగా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చే సేవలో ఉన్నాను.అదేనాశ్వాస. .పిల్లల్లో మానవతావిలువలు పెంపొందించేందుకై ఆటలద్వారా నేర్పను చాలా ఛార్ట్స్ తయరు చేశాను. పిల్లలకోసం 78నుండీ చిన్న ఆర్టికల్స్ వ్రాసేదాన్ని.అప్పుడు ఆంధ్రపత్రిక ఉండేది. దాన్లో చాలానే వచ్చాయి.వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, పిల్లలకోసం పజిల్స్ , రిడిల్స్,నీతికధలు , నాటకాలు, పాటలు, గేయాలు పాఠశాల వార్షికోత్సవం కోసం వ్రాసుకునే దాన్ని. విజయవాడ ఆకాశవాణి నుంచీ కొన్ని నాటకాలు,ప్రసంగాలు ప్రసారమయ్యాయి.అప్పటి చాలాపత్రికల్లో చాలానే వచ్చాయి. బాలలకోసం సుమారుగా 150 పైనే కధలు వివిధపత్రికల్లో వచ్చాయి. వెబ్ మ్యాగజైన్స్-[చైతన్యం సంకల్పబలం వంటి ] లో పిల్లలకధలు వస్తూ ఉంటాయి,శ్రీవాణి అని మచిలీపట్నం నుంచీ వచ్చే సాంస్కృతిక సాహిత్య మాస పత్రికలో ప్రతి మాసం ఒక కధ 2004 నుంచీ వస్తున్నాయి.వార్త లో సుమారుగా 3సం. మంచిమాటలో కాలమిస్ట్ గా వ్రాశాను. చందమామ లాంటి బాలల పత్రికల్లో కధలు వచ్చాయి.కొన్ని కధలకు బహుమతులుకూడా వచ్చాయి.
నేను కినిగె లో e books గా సెల్ఫ్ పబ్లిష్ చేసుకున్న నా నవల ' సాగర తరంగాలు, మరియు హాస్యకధా కదంబం మీ సహకారంతో అచ్చంగ తెలుగు లో ఉంచుటకు ఇష్టపడుతూ, మీసహకారానికి సహృదయానికీ , నాలాంటి గుర్తింపులేని రచయితను ప్రోత్సహించే మీ మంచిమనస్సుకు నా హృదయ పూర్వక కృతఙ్ఞతలమ్మా!
హైమాశ్రీనివాస్.
నేను e books గా కినిగె లో ప్రచురించు కున్న కధామాలికలను మీ సహకారంతో అచ్చంగా తెలుగు లో ప్రకటించుటకు ఇష్టపడుతూ, మీ సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆదూరి.హైమావతి .
పత్రికలో వీరి రచనలను క్రింది లింక్స్ లో చదవి, మీ విలువైన అభిప్రాయాలు తెలుపండి.