మంథా భానుమతి గారి గురించి :
పుట్టింది అమలాపురం, కోనసీమలో, పెరిగింది గుంటూరులో, నివాసం హైద్రాబాద్ లో.
జీవననేస్తం-- మంథా రామారావు బి.టెక్. విద్యుత్ శాఖలో సూపరెండెంట్ ఇంజనీర్ గా పదవీ విరమణ చేశారు.
ఇద్దరబ్బాయిలు-
చదువు –ఉస్మానియా యూనివర్సిటీ యమ్. యస్సీ, యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్, యు.యస్. ఏ నుండి రసాయన శాస్త్రంలో యమ్.యస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి,
వృత్తి- విశ్రాంత ప్రభుత్వ రసాయన శాస్త్ర అధ్యాపకురాలు.
ప్రవృత్తి- సంగీతం (పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలం నుంచి కర్నాటక సంగీతంలో డిప్లమా)
సాహిత్యం- పఠనం, రచన, యోగా.
రచనలు- ఇరవై నవలలు, డెబ్భై పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురింప బడ్డాయి. కొన్నింటికి బహుమతులు లభించాయి.,
పబ్లిష్ అయిన నవలలు
1.గ్లేషియర్- ‘రచన’ మాస పత్రిక --నర్శిపురం ఆదిలక్ష్మి స్మారక నవలల పోటీలో బహుమతి పొందిన నవల.
2.అంతా ప్రేమమయం--’స్వాతి’ వార పత్రిక (పదహారు వారాల నవలల పోటీలో గెలుపొందింది.
3రామాయణం మామయ్య--’ఆంధ్రభూమి’ నవలల పోటీలో( ప్రత్యేక బహుమతి పొందినది.)
4.శివానీ- ‘కౌముది’ అంతర్జాల పత్రిక
5.అగ్గిపెట్టిలో ఆరుగజాలు- ‘ఆంధ్రభూమి’ వారపత్రిక
6.అరుణోదయం- ‘ఆంధ్రభూమి’ వారపత్రిక
7.మౌనంగానే ఎదగమని-’స్వాతి’ మాస పత్రిక 2009 లో అనిల్ అవార్డ్ పొందిన నవల.
8.మారని భారతంలో మరో శకుంతల- ‘స్వాతి’ మాసపత్రిక
9.మాయ పండు- ‘చతుర’
10.సిస్టర్ కరుణ- ‘ఆంధ్రభూమి’ మాసపత్రిక
11.అనుబంధాలు- ‘నవ్య’. (ఎనిమిది వారాల నవలల పోటీలో ఎన్నికైన నవల)
12.జీవన పోరాటం--- ‘కౌముది’ అంతర్జాల పత్రిక.
13.సగం ఇక్కడా సగం అక్కడా!— ‘స్వాతి’ మాసపత్రిక
14. జనని- ‘ఆంధ్రభూమి’ వారపత్రిక
15. నిన్నటినాతో రేపటి నేను- ‘స్వాతి’ మాస పత్రిక
16. మేఘం లేని మెరుపు.- ‘కౌముది’ అంతర్జాల పత్రిక
17. “మొదటిఅడుగు” ఆంధ్రభూమి వారపత్రికలో ధారా వాహికగా వస్తోంది.
18. “ప్రేముడి” .. కౌముది లో జనవరి నుంచీ వస్తుంది.
19. చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు.. తెలుగు వన్ .కామ్ లో వచ్చింద.. ధారా వాహికగా. నది మాసపత్రిక పోటీలో సమ బహుమతి పొందినది.
20. అజ్ఞాత కుల శీలస్య.. . teluguone.com
బహుమతి పొందిన కథలు---
అమూల్య- అంధ్రభూమి కథల పోటీలో బహుమతి పొందింది.
చిన్నమ్మ (అమెరికా పత్రిక తెలుగు జ్యోతి వారి పోటీలో రెండవ బహుమతి..)
అమ్మాయికి కావాలనిపించేది-(స్వాతి సరసమైన కథల పోటీలో సమ బహుమతి)
నవ్వు నవ్వించు-(కౌముది-రచన సంయుక్త నిర్వహణలో )
కుటీచకుడు—(కౌముది-రచన సంయుక్త నిర్వహణలో)
ఆమాటే అడిగావూ?-(ఆటా వారి పోటీలో..)
ముసలిపల్లి-(ఆంధ్రభూమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి)
అభీ అభీ.. ఆంధ్ర భూమి పోటీలో ఎన్నికయింది.
కవితలు- .
“ఆగు ప్రియా..” ఆంధ్రభూమి వారపత్రికలో పల్లవి గా..
రెండు ఆంధ్రభూమి మాస పత్రికలో..
అప్పుడప్పుడు.. కవితల వనంలో, కవి సంగమంలో .. వస్తూ ఉంటున్నాయి.
అంతర్వేదిలో జరిగిన సాహితీ సేవ సమావేశంలో బహుమతి పొందిన “మనం” కవిత.
ఛందో బద్ధ కవితలు--
అర్క శతకం- కందాల మాల.
అంశు శతకం- కందాల మాల
కృష్ణా పుష్కరాలు- దశ కందాల మాల.. అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రిక.
మైండ్ ఇండియా భారమాత పద్యాల పోటీలో ప్రోత్సాహక బహుమతి.
అక్కిరాజు ప్రసాద్ ఏరువాక పద్యాల పోటీలో ప్రధమ బహుమతి.
వీర నరసింహరాజుగారి శివరాత్రి పద్యాల పోటీలో తృతీయ బహుమతి.
‘ధనుర్మాస వైభవం’- అచ్చంగా తెలుగు బృందం వారి పద్యాల పోటీలో ప్రధమ బహుమతి.
నా పద్య రచనా ప్రస్థానంపై నేను రాసుకున్న పదాలు, పద్యాలు..
ఫేస్ బుక్ లో అచ్చంగా తెలుగు అని ఒక సాహితీ బృందం ఏర్పడింది. అందులో నన్ను కొందరు మిత్రులు చేర్పించారు. అది ఏ విధంగా..
విద్యున్మాలా వృత్తం.
అచ్చంగానే యాప్యాయంగా
నెచ్చోటన్ కాన్పించే వారే
యిచ్చంత్రంగా యేర్పాట్లేనున్
వచ్చీ చేసే బాళిన్ గుంపున్.
ఈ విధంగా అచ్చంగా తెలుగు బృందం ఏర్పడ్డాక.. ఛందస్సు నేర్పించి గురువు కట్టుపల్లి ప్రసాద్ గారు ఒక ప్రహేళిక నిర్వహించారు.
మత్త కోకిల:
గుమ్మడాటను కట్టుపల్లియె కోరి నిర్వహణంబునే
గుమ్ముగా జరిపించె గామరి కొమ్మచాటున దాగియున్
గుమ్మడుల్ సడి సేయకున్న నొకొక్కరిన్ కని పెట్టిరే
యిమ్మడిన్ గమనించి చేరితి యీప్సితంబున యిచ్చటన్.
ఆట వెలది:
పద్యములను మరియు గద్యములనునేను
రాయ లేదు గాని రమ్యముగను
సంతసమున చదివి యెంతనో స్పందించి
గుమ్మడైతిని గద కోర గానె.
అంతలో.. మైండ్ ఇండియా వారు నిర్వహించిన పద్యాల పోటీ మీద ఆసక్తి కలిగి, చెల్లి నండూరిని యడిగితి ఛందమున పద్యమల్లగనుల్లాసంబుగ నుంటినని..
వెనువెంటనే చెల్లి చూపిన బాట పయనించి, కట్టుపల్లి వారి పాఠముల నభ్యసించి.. సంధ్య మీద నల్లిన కందం పలు ప్రశంస లందుకోడంతో, ఉత్సాహంతో.. దేశ మాత మీద పద్యాలను వ్రాయంగా..
కం.
అదిగదిగో లభియించెను
మదినానందమున దేల్చి మైమరపించే
కదయది నొక్కటి, బహుమతి
యదె ప్రోత్సాహకము నాకు యౌరా! వచ్చెన్.
(కద= వార్త)
ఇంక నారంభమైన నా ప్రస్థానం.. పోటీలలో బహుమతులందుకొంటూ సాగుతోంది. చారిత్రాత్మక నవలనొకటి తొంబది పైగా పద్యములతో వ్రాయగా మెచ్చుకొనిరందరూ. మరియూ..
కం.
వ్రాసితి నర్క శతకమును
వాసిగలదని చదువరులు ప్రస్తుతి సేయన్
నాశన్ వ్రాయ మొదలిడితి
లేశము శంక చొరవక వలివెలుగు మీదన్.
(వలివెలుగు= చంద్రుడు)
అదండీ నా రచనా వ్యాసంగ విశేషంబు.
పురస్కారాలు..
లేఖిని సంస్థ వారి మాతృదేవ పురస్కారం, కళాసాగరం వారి జీవితకాల సాఫల్య పురస్తాకం, బోయి హైమవతిగారిచే కొత్తూరి సుబ్బయ్య దీక్షితులు దంపతుల జీవిత పురస్కారం.
*********************************************************************************************************************
పత్రికలో భానుమతి గారి రచనల్ని క్రింది లింక్ లలో చదవగలరు.
http://www.acchamgatelugu.com/2017/02/gurajada-shobha-perindevi.html
http://www.acchamgatelugu.com/2017/01/telugu-madhyamam-manugada.html
http://www.acchamgatelugu.com/2016/12/madhara-maala-kadhala-samputi.html
http://www.acchamgatelugu.com/2016/11/balakrishnuni-leelalu-utsahamuto.html
http://www.acchamgatelugu.com/2016/10/nishiratri-kalayika.html
http://www.acchamgatelugu.com/2016/07/vacchesinaay-kittamma-pushkaralu.html
http://www.acchamgatelugu.com/2016/07/krishnaveni-sannuti.html
http://www.acchamgatelugu.com/2016/05/okari-kokaru.html
http://www.acchamgatelugu.com/2015/12/viluvalu.html